ఆమదాలవలస: ఆముదాలవలస పట్టణంలో గాంధీ విగ్రహం వద్ద రామోజీరావు మృతికి కొవ్వొత్తులతో సంతాపం తెలిపిన పత్రిక విలేకరులు మీడియా సభ్యులు
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పట్టణంలో గల వన్‌వే జంక్షన్ గాంధీ విగ్రహం వద్ద బుధవారం సాయంత్రం 6:30 గంటలకు పత్రిక విలేకరులు మీడియా సభ్యులు రామోజీరావు మృతి పై తీవ్రత బ్రాంతి వ్యక్తం చేస్తూ కొవ్వొత్తులతో సంతాపం తెలిపారు.. అక్షర శిల్పి రామోజీరావు చత్రపటానికి ముందుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు.. రామోజీరావు అమర్ రహే అంటూ నినాదాలు ర్యాలీ చేశారు... పత్రికా మీడియా రంగాల్లో రామోజీరావు విశేష సేవలు చేశారని పలువురు కొనియాడారు...