సూర్యాపేట: సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా
సూర్యాపేట జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద మంగళవారం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు ఆరు నెలలుగా జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టు ఆడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నెల నెల వేతనం వస్తేనే పూట గడిచే పరిస్థితి ఉందని వాపోయారు. ఈ విషయంపై కలెక్టర్ ను కలిసిన ఫలితం లేదన్నారు. దసరాకు పిల్లలకు బట్టలు కొందామని ఇబ్బంది గానే ఉందని ప్రభుత్వ స్పందించి వెంటనే జీతాలను చెల్లించాలన్నారు.