విజయవాడ గిరిపురం ఉద్రిక్తత వాతావరణం
విజయవాడలోని గిరిపురం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హిజ్రాల వేధింపులు తాళలేక కుమారి అనే మహిళ ఆత్మహత్య చేసుకుని మృతి చెందడంతో స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న డీసీపీ సరిత, ఏసీపీ దామోదర్, ఇతర సీఐలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో పోలీసులు ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నారు.