పలాస: పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీ పరిధి పాత జాతీయ రహదారిపై ఢీకొన్న ఎదురెదురుగా వస్తున్న రెండు స్కూటీలు నలుగురికి గాయాలు
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పాత జాతీయ రహదారిపై మసీదు సమీపంలో శనివారం రాత్రి 9 గంటలకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా రెండు స్కూటీలు అతివేగంగా ఢీకొనడంతో వజ్రపుకొత్తూరు మండలం మర్రిపాడు గ్రామానికి చెందిన రాపాక మోహన్ రావు (56), సింహాచలం తో పాటు పలాస మండలం కేదారిపురం గ్రామానికి చెందిన తామరపల్లి ఢిల్లేశ్వరి (36), పాడి కృష్ణవేణి(40), పాడి శిరీష (13) లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.