సరైన ఆహార అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవన శైలితోనే బ్రెయిన్ స్ట్రోక్ నివారణ సాధ్యమని మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ నాగేంద్రప్రసాద్ తెలియజేశారు. రాయదుర్గం అర్బన్ 17, 18 సచివాలయాల పరిధిలోని శాంతినగర్‌లో ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా బుధవారం సాయంత్రం స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం తోపాటు పొగ త్రాగడం, మద్యం తాగడం, వ్యాయామం లేకపోవడం, అధిక ఒత్తిడి వంటివి స్ట్రోక్‌కు దారి తీసే ప్రధాన కారణాలనీ తెలియజేశారు. మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవడం లేదా రక్తనాళం పగిలిపోవడం వల్ల స్ట్రోక్ వస్తుందన్నారు.