కర్నూలు: మెప్మా ఆర్పీలకు కనీస వేతనం చెల్లించాలి: కర్నూలు కలెక్టరేట్ పోదుపు ఆర్పిలు ఆందోళన
మహిళా మాట్ గ్రూప్ సభ్యులు చెల్లించిన రూ. 65 లక్షలు తక్షణమే విడుదల చేయాలని కర్నూలు లో పోదుపు మహిళలు ధర్నా చేపట్టారు. సోమవారం ఉదయం 12 గంటలు కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఏపీ మెప్మా ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేస్తూ తమ పెండింగ్ వేతనాలను చెల్లించాలని ఏపీ మెప్మా జిల్లా కార్యదర్శి ఉమాదేవి డిమాండ్ చేశారు. ఆర్పీల నెల వేతనం రూ.26,000 అమలు చేయాలని, గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని, వేతనాలను వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని వారు కోరారు.