మెదక్: మండల వ్యాప్తంగా రెండవ రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Medak, Medak | Sep 21, 2025 రెండవ రోజు ఎంగిలిపూల బతుకమ్మ నిజాంపేట మండల వ్యాప్తంగా పెత్తర అమావాస్య సందర్భంగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజాంపేట మండల కేంద్రంలో బతుకమ్మ లను మహిళలు గాంధీ చౌరస్తా వద్దకు చేరుకొని బతుకమ్మ ఆటపాటలతో అలరించారు. పెత్తర అమావాస్య పురస్కరించుకొని బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని కూడా అంటారని ఈ పండుగను తెలంగాణ సాంస్కృతికి ప్రతీక అని, పకృతిని ఆరాధిస్తూ గౌరమ్మను పూజించి, రంగు రంగుల పువ్వులతో బతుకమ్మను అలంకరించి మహిళలు ఆటపాటలతో పండుగ వేడుకలు జరుపుకుంటామని తెలిపారు.