ఉదయగిరి: కర్నూలు బస్సు దహనం దుర్ఘటనలో ఒకే కుటుంబంలో నలుగురు ఆహుతి
మరో కుటుంబంలో నలుగురు తప్పించుకున్నారు:ఉదయగిరి MLA సురేష్
కర్నూలులో జరిగిన బస్సు దహనం దుర్ఘటనలో మరణించిన నెల్లూరు జిల్లా వింజమూరు మండలానికి చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు మృతిచెందడం బాధాకరమని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. మృతుల బంధువులను దుర్ఘటన జరిగిన ప్రాంతానికి పంపుతున్నామని చెప్పారు. అక్కడ డిఎన్ ఏ పరీక్షలు చేసి , మృతదేహాలను అప్పగిస్తారని తెలిపారు. దీపావళి పండుగకు హైదరాబాద్ కి వెళ్లి, అక్కడనుంచి నేరుగా బెంగుళూరుకు పోతుండగా ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరుకు చెందిన మరో నలుగురు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారని తెలిపారు.