పుంగనూరు: గుంతల మాయమైన రామసముద్రం పుంగనూరు రోడ్డును మరమ్మతు చేయాలి. సిపిఐ నాయకులు వెంకటరమణారెడ్డి డిమాండ్.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణ నుంచి రామసముద్రం వెళ్లే మార్గంలో పుంగమ్మ చెరువు కట్ట పైన రోడ్డుపై పెద్ద పెద్ద గుంతులు ఏర్పడడంతో టు వీలర్లు ఆటోలు వాహనాలు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని సిపిఐ నాయకులు వెంకటరమణారెడ్డి సోమల మధ్యాహ్న మూడు గంటల ప్రాంతంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రామ్మూర్తి పాల్గొన్నారు.