కనిగిరి పట్టణంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ టిడిపి ఆధ్వర్యంలో విద్యార్థులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి గురువారం పాలాభిషేకం నిర్వహించారు. పట్టణంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు మంత్రి లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పట్టణ టిడిపి అధ్యక్షులు ఫిరోజ్ మాట్లాడుతూ.... విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పాత బకాయిలను మంత్రి లోకేష్ రూ.1200 కోట్లు విడుదల చేయడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. దీంతో విద్యార్థుల చదువులు సాఫీగా సాగుతాయన్నారు.