పుస్తక పఠనం మనిషిలోని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞాన జ్యోతిని వెలిగిస్తుందని తాడిపత్రి ప్రభుత్వ గ్రంథాలయాధికారి రవికుమార్ నాయుడు, హెచ్ఎం శైలజ అన్నారు. తాడిపత్రిలోని ప్రభుత్వ గ్రంథాలయంలో గత వారం రోజులుగా జరుగుతున్న జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారం ముగిశాయి. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పుస్తకాలు చదవడం అంటే జ్ఞానాన్ని సంపాదించడమేనన్నారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను ఆశ్రయించాలన్నారు.