సర్వేపల్లి: కోట్లాది రూపాయలతో పల్లెల ప్రగతి : సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి
వైసీపీ పాలనలో డ్రైన్ల పేరుతో కోట్ల దుర్వినియోగం జరిగిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.అస్తవ్యస్తంగా చేసిన పనులతో ప్రజలకు కొత్త సమస్యలు వస్తున్నాయన్నారు. వెంకటాచలం మండలం చెముడుగుంట పంచాయతీలో రూ.1.08 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్భంగా ఆయన మంగళవారం సాయంత్రం 6 గంటలకు మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనుల జాతర మొదలైందన్నారు. చిన్న చిన్న పంచాయతీల్లోనూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి జరుగుతున్నాయన్నారు