యర్రగొండపాలెం: త్రిపురాంతకంలోని ఉమ్మడి ఆలయాలలో దసరా శరన్నవరాత్రుల వేడుకల గురించి తెలిపిన ఈవో అనిల్ కుమార్
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలో వెలిసిన త్రిపురాంతకేశ్వర స్వామి మరియు బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయాలలో దసరా శరన్నవరాత్రుల మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వణ అధికారి అనిల్ కుమార్ చైర్మన్ కోటేశ్వరరావు తెలిపారు. సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. శరన్నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.