కుప్పం: కుప్పం ఆర్టీసీ డిపోను సందర్శించిన ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం
కుప్పం ఆర్టీసీ డిపోను ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం సోమవారం సందర్శించారు. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిపో కార్యకలాపాలు బస్సుల నిర్వహణ సిబ్బంది ప్రయాణికుల సమస్యలను ఆరా తీశారు. డిపోలో ఉన్న లోటు పాట్లను వెంటనే పరిష్కరించాలని, సమయపాలన ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు నాణ్య మైన సేవలు అందించాలన్నారు. స్త్రీ శక్తి పథకంలో మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.