డోన్ మండలంలో విషాదం ,విద్యుత్ షాక్ గురై యువకుడు మృతి
Dhone, Nandyal | Nov 1, 2025 డోన్ మండలం కొచ్చెరువు గ్రామ సిగరమాను మిట్ట సమీపంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా చికెన్ దుకాణంలో పనిచేసే యువకుడు కురువ మంజునాథ్ 20) కరెంటు షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పక్కనే ఉన్న నీలప్ప కూడా ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.