రాపర్తి గ్రామంలో వైద్య పరీక్షలు పరిశీలించిన పిఠాపురం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ గండి కొండలరావు
కాకినాడ జిల్లా పిఠాపురం మండలం రాపర్తిలో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం మహిళల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు బీజేపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ గండి కొండలరావు తెలిపారు. ఈ శిబిరంలో మహిళలకు వైద్య, స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్యాలయం నుండి సాయంత్రం 6 గంటలకు ప్రకటనలో మీడియాకు తెలిపారు.