నరసన్నపేట: నరసన్నపేట అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక దందాకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో అనుమతులు లేకుండా ఇసుక దందాకు పాల్పడితేచట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి హెచ్చరించారు. ఆదివారం రాత్రి 7:30 గంటలకు ఆయన నరసన్నపేటలో మాట్లాడారు. ఇటీవల మడపం గ్రామంలోని బుచ్చి పేట ర్యాంప్ వద్ద ఇసుక అక్రమ రవాణా చేసినట్లు మీడియాలో వచ్చిందని తెలిపారు దందాకు పాల్పడిన ఏ పార్టీ నాయకులు అయినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు...