ప్రకాశం జిల్లాలో విపరీతంగా కురుస్తున్న మంచుతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. కొద్దిరోజులుగా విపరీతంగా తెల్లవారుజామున మంచు కురుస్తుండడంతో జాతీయ రహదారి మరియు రాష్ట్రీయ రహదారులపై నుంచి వాహనదారులు అవస్థలు పడుతూ ప్రమాదాలపై ఆందోళన చెందుతున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు వాహరదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ వాహనాలు నడపాలని ముఖ్యంగా అత్యధికంగా మంచు కురుస్తున్న సమయంలో అవసరమైతే వాహనదారులు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం వాహరదారులకు ప్రకటనలో తెలిపారు.