నిర్మల్: నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్ అభిలాష అభినవ్
Nirmal, Nirmal | Sep 15, 2025 ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణిలో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, వారి సమస్యలు తీర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను ఏమాత్రం పెండింగ్లో ఉంచకుండా త్వరగా పరిష్కరించేలా జిల్లా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో అదనపు కలెక్టర్ లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.