ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ను సత్కరించిన మాపాక్షి గ్రామస్తులు
Chittoor Urban, Chittoor | Sep 16, 2025
చిత్తూరు : చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారిని మాపాక్షి గ్రామస్తులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. గ్రామానికి చెందిన ఝాన్సీ వెంకటేష్ యాదవ్ కు చిత్తూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్ట్ ఇవ్వడంపై ధన్యవాదాలు తెలిపారు. గజమాల, పూల కిరీటం, కత్తితో సత్కరించారు. పార్టీ కోసం శ్రమించిన వారికి సరైన గుర్తింపు ఇచ్చారని, మున్ముందు పార్టీ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బాబు, డివిజన్ ఇంచార్జీ దేవేంద్ర, నాయకుల రాధాకృష్ణ, ఎల్.బాబు, మురుగేష్ కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.