చింతపల్లి: బద్దవారిగూడెంలో కడారి చంద్రయ్య అనే వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని మృతి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
నల్గొండ జిల్లా, చింతపల్లి మండల పరిధిలోని బద్దవారిగూడెం గ్రామానికి చెందిన కడారి చంద్రయ్య (55) అనే వ్యక్తి సోమవారం సాయంత్రం చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా గ్రామంలోని ఓ వ్యక్తి బెదిరింపులకు భయపడి ఉరి వేసుకుని మృతి చెందినట్లు మృతుని కుటుంబీకులు ఆరోపించారు. ఎస్సై రామ్మూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చంద్రయ్య మృతితో బద్దవారిగూడెంలో విషాదఛాయలు ఆలముకున్నాయి.