బాన్సువాడ: దామరంచ శివారులోనీ మంజీరా నదిలో గుర్తి తెలియని వ్యక్తి శవాన్ని కనుగొన్నట్లు ఎస్సై రాజశేఖర్ వెల్లడి
బీర్కూరు మండలం దామరంచ గ్రామ శివారులో గల మంజీరా నదిలో గుర్తుతెలియని మగ వ్యక్తి శవాన్ని కనుగొన్నట్లు ఎస్సై రాజశేఖర్ వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. 35 నుండి 45 సంవత్సరాల వయసు గల వ్యక్తి తెలుపు ,రంగు నలుపు రంగు దుస్తులు ధరించారని ఎడమ చేతి పైన లింగమ్మ అని పచ్చబొట్టు ఉందని ఆయన తెలిపారు. పూర్తి వివరాల కొరకు బీర్కూర్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.