గంగాధర నెల్లూరు: GD నెల్లూరు మండలం ఎల్లమరాజు పల్లిలో బాధిత మహిళలకు రెడ్ క్రాస్ సహాయం
GD నెల్లూరు మండలం ఎల్లమరాజు పల్లిలో ఇటీవల కురిసిన వర్షానికి కుమారి అనే మహిళ ఇల్లు పడిపోయింది. ఆమెకు సహాయార్థం రెడ్ క్రాస్ తరఫున మంగళవారం గుడిసె కప్పుకోవడానికి తార్పాలు పట్ట, వంట చేసుకోవడానికి 14 రకాల వంట సామాగ్రి కుమారి కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కార్యదర్శి సహదేవనాయుడు పరిపాలన అధికారి గోపి, కోఆర్డినేటర్ చిరంజీవి, జీవిత సభ్యులు పాల్గొన్నారు.