అనారోగ్యంతో ఉన్న కార్యకర్తలకు ఆర్థిక సహాయం అందించిన టీడీపీ శ్రేణులు
అనారోగ్యంతో ఉన్న కార్యకర్తలకు టీడీపీ శ్రేణులు ఆర్థిక సహాయం అందించారు.కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తెదేపా ప్రభుత్వం అండగా ఉంటుందని, కార్యకర్తల సంక్షేమానికి తోడ్పడుతుందని తెదేపా నాయకులు పెట్రోల్ బంకు యజమాని జమీరుద్దీన్, సింగిల్ విండో డైరెక్టర్ లంకిపల్లి మధు, లంకిపల్లి గురునాథ నాయుడు అన్నారు. ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అనారోగ్యంతో బాధపడుతున్న మేకలవారిపల్లికి చెందిన పురుషోత్తంకు10 వేలు, బోడెన్నకు 6వేలు,రాజుకు 6వేలు,గోవిందరాజ పురంకు చెందిన వెంకటరమణకు 3వేల రూపాయలు ఆర్థిక సహాయంను అందించి మేమున్నామంటూ భరోసా ఇచ్చామని తెలిపారు