సత్యసాయి జయంతి వేడుకల ఏర్పాట్లను పరిశీలించేందుకు బుల్లెట్ ఎక్కిన కలెక్టర్ & ఎస్పీ
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ బుధవారం మధ్యాహ్నం బుల్లెట్ వాహనంపై తిరుగుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పెట్రోల్ బంకు, చింత తోపు, పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్దకు వెళ్లి అధికారులతో మాట్లాడి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.