నెల్లూరు కామాటివీధి కృష్ణమందిరంలో కృష్ణుడి పంచలోహ ఉత్సవ విగ్రహాన్ని దొంగిలించిన వ్యక్తిని త్రీటౌన్ పోలీసులు ఐదు గంటల్లో పట్టుకున్నారు. ఉదయం వాచ్మెన్ ఆలయం తలుపులు తీసిన తర్వాత చిత్తుకాగితాలు ఏరుకునే వెంకయ్య అనే వ్యక్తి ఆలయంలోకి చొరబడి విగ్రహాన్ని గోతంలో వేసుకుని వెళ్లిపోయాడు. అనంతరం హరనాథపురంలో పాత ఇనుప సామాను కొనుగోలు చేసే షేక్ షఫీకి విక్రయించాడు.