జానకంపల్లిలో మామిడి చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
శ్రీ సత్య సాయి జిల్లా బుక్కపట్నం మండలం జానకంపల్లి సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద మంగళవారం సాయంత్రం మామిడి చెట్టుకు ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు పుట్టపర్తిలోని సాయి నగర్ కి చెందిన రాము (37) గా తెలిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.