భూపాలపల్లి: రేపు భూపాలపల్లికి రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ రాక : వెల్లడించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నియోజకవర్గ పర్యటనకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల, వృద్ధుల సంక్షేమ మరియు ట్రాన్స్ జెండర్ల సాధికారత శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రానున్నారని, ఇట్టి పర్యటనను విజయవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈరోజు సాయంత్రం భూపాలపల్లి ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం నుండి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో కోరారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు భూపాలపల్లి మండలం దూదేకులపల్లి గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 2:30 గంటలకు గొల్లబుద్దారం గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.