మెదక్: మెదక్ సిద్దిపేట బస్సులు పునః ప్రారంభించిన అధికారులు
Medak, Medak | Sep 15, 2025 నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామ శివారులోని గల బ్రిడ్జి గత కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు కృంగిపోవడంతో 15 రోజులుగా మెదక్ నుండి సిద్దిపేటకు రాకపోకలు అంతరాయం ఏర్పడడంతో తాత్కాలిక రోడ్డు పనులు ప్రారంభించగా ఎస్సై రాజేష్, ఏంపిడివో రాజి రెడ్డి లు రోడ్డు పనులను పర్యవేక్షించారు. తాత్కాలిక రోడ్డు పనుల విషయంలో పైపులు వేసి వాటిపై స్లాబ్ వేసి సోమవారం రోడ్డు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రామాయంపేట నుండి సిద్దిపేటకు రాకపోకలు పునరుద్ధరణ కావడంతో ప్రయాణికుల ఇబ్బందులు తాత్కాలికంగా తీరాయని అన్నారు, మెదక్ సిద్దిపేట డిపోల యాజమాన్యంతో మాట్లాడి బస్సులను పునః ప్రారంభించారు.