బాన్సువాడ: ఎస్సీ ఎస్టీల విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు; దుర్కి బాన్సువాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
నర్సుల్లాబాద్ మండలం దుర్గి శివారులో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ గిరిజన ఇంటర్, డిగ్రీ బాలికల వసతి గృహాన్ని గురువారం మధ్యాహ్నం 12 గంటలకు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం వెనుకబడిన తరగతుల వారి కొరకు విద్యాభివృద్ధికి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుందని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని వృద్ధి చెందాలని సూచించారు. అనంతరం బంజారా నాయకులు ఏర్పాటు చేసిన భోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొని జగదంబ మాత సేవలాల్ మహారాజు చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించారు.