మంత్రాలయం: మంత్రాలయంలోని తుంగభద్ర నదిలో కార్తీక మాసం లో పుణ్య స్నానాలకు వచ్చే భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేయాలి
మంత్రాలయం:కార్తీక మాసం బుధవారం నుంచి ప్రారంభం కానుంది.మంత్రాలయం మండల కేంద్రంలో తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలకు వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. పుష్కరాల సమయంలో నిర్మించిన ఘాట్లు శిథిలావస్థకు చేరగా అధికారులు పర్యవేక్షించటం లేదని స్థానికులు చెబుతున్నారు. స్నాన ఘాట్ల అభివృద్ధిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని మంగళవారం భక్తులు కోరుతున్నారు.