కోడుమూరు: కోడుమూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేనేత కార్మిక సంఘం ధర్నా
కోడుమూరు తహసిల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాధవస్వామి మాట్లాడుతూ చేనేత కార్మికులకు పింఛన్లు, చేనేత భరోసా రూ. 36 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇల్లు లేని వాళ్లకు స్థలం, ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. చేనేత కార్మికులకు బీమా, 50% సబ్సిడీ పరికరాలు, ముద్ర రుణాలు ఇవ్వాలన్నారు.