దర్శి: పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఘన నివాళులర్పించిన దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం జిల్లా కురిచేడు పట్టణంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లలిత సాగర్ దంపతులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. మాతృభాష మాతృ రాష్ట్రం కోసం ప్రాణాల అర్పించిన మహా త్యాగి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన కృషి వల్లనే ఆంధ్ర రాష్ట్ర ఏర్పడిందని పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని పిలుపునిచ్చారు.