భూపాలపల్లి: గణపురంలో భారతరత్న డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన భూపాలపల్లి ఎమ్మెల్యే
భూపాలపల్లి నియోజకవర్గం గణపురంలో మండల విద్యా వనరుల కేంద్రంలో కీ.శే. ఊరుగొండ రాధాదేవి గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన మన భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, తత్త్వవేత్త, రాజకీయ నాయకుడు, భారతరత్న డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై, విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయులకు మాత్రమే కాదు, దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు. విద్య అనేది కేవలం పాఠశాలలోనే మాత్రమే కాదు, మన జీవన విధానంలోనూ, నైతిక విలువలలోనూ ప్రతిబింబించాలన్నార