ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉల్లగల్లు గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు రవికుమార్ బాల వీరాంజనేయ స్వామి టిడిపి జిల్లా అధ్యక్షులు ఉగ్ర నరసింహ రెడ్డి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు ఇన్చార్జీలు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.