రాయదుర్గం: పట్టణంలో టీచర్ ఉద్యోగాలకు ఎంపికైనవారిని అభినందించిన ప్రభుత్వవిప్ కాలవశ్రీనివాసులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డిఎస్పీ నియామకంలో ఉపాధ్యాయులు గా ఎంపికైన వారిని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు అభినందించారు. బుధవారం రాయదుర్గం పట్టణంలోని హాటకేశ్వర ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన అభినందన సభలో రాయదుర్గం నియోజకవర్గం నుండి ఉద్యోగాలు పొందిన 58 మందికి ఆయన చేతుల మీదుగా శాలువాలతో సత్కరించి మెమొంటోలు అందజేశారు. మారుమూల ప్రాంతంలో విద్యాభివృద్ధికి కృషి చేయాలని కోరారు.