తాడిపత్రి: యాడికి మండల కేంద్రంలో సత్య(23) అనే యువకుడు ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య
యాడికి మండల కేంద్రంలోని నారాయణస్వామి కాలనీలో నివాసముండే రమణమ్మ కుమారుడు సత్య (23) సోమవారం ఇంటిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.రమణమ్మకు మొత్తం నలుగురు కుమారులు.మూడవ కుమారుడు సత్య.సత్య బేల్దారి పని చేస్తుండేవాడు.గత కొంతకాలంగా కడుపునొప్పి తో బాధపడుతున్నాడు. కడుపు నొప్పిని భరించలేక ఇంటిలో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని తనువు చాలించాడు.దర్యాప్తు చేపట్టారు.