విజయవాడ సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగ హల్చల్, పట్టుకొని తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు
విజయవాడ సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఒక దొంగ హల్చల్ చేశాడు. స్థానికులు ఇది గమనించి అతనిని పట్టుకొని దేహశుద్ధి చేసి తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.