గిద్దలూరు: గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామ సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామ సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటన మంగళవారం జరిగింది. ప్రమాదంలో బురుజు పల్లి గ్రామానికి చెందిన సిద్దయ్య అనే వ్యక్తికి మొదట తీవ్ర గాయాలు కావడంతో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సిద్దయ్య మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. జరిగిన ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.