పుంగనూరు: శ్రీ బోయకొండ గంగమ్మ భక్తులకు వెబ్సైట్ సౌకర్యం ఆలయ కార్య నిర్వహణ అధికారి ఏకాంబరం.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగువపల్లి లో వెలసి ఉండు కోరిన కోరికలు తీర్చే శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారి భక్తుల అమ్మవారి దర్శనం. సౌకర్యార్థం వెబ్సైట్. వాట్సాప్ ద్వారా సేవలు ప్రసాదము దర్శనం వసతి సౌకర్యం నమోదు చేసుకొనుటకు భక్తులు వెబ్సైట్. https://www.aptemples.org మరియు మనమిత్ర వాట్సాప్ 9552300 009 సందర్శించి నమోదు చేసుకోవాలని ఆలయ కార్య నిర్వహణ అధికారి ఏకాంబరం ఆదివారం మధ్యాహ్నం ఒక గంటకు ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు