కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో అత్యంత ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
కళ్యాణదుర్గంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం రాత్రి జ్వాలా తోరణాన్ని ఘనంగా నిర్వహించారు. జ్వాలా తోరణాన్ని వీక్షించడానికి భక్తులు తరలి వచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది. ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.