కొలిమిగుండ్ల మండలం లో విషాదం, పుట్టినరోజు నాడే యువకుడు ఆత్మహత్య
పుట్టినరోజు నాడే ఓ యువకుడి ఆత్మహత్య ఘటన కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లెకు చెందిన దాసరి కార్తీక్(23) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం పుట్టినరోజు వేడుకలకు కుటుంబీకులు సిద్ధమవుతుండగా ఇంట్లో ఉరివేసుకున్నాడు. జీవితంపై విరక్తి చెంది సూసైడ్ చేసుకున్నట్లు CI రమేశ్ బాబు వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ ఘటనతో స్నేహితులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.