శంకరంపేట్ ఆర్: చిన్న శంకరంపేట్ మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రోహిత్ రావు
చిన్న శంకరంపేట్ మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మన్నంపల్లి రోహిత్ రావు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గెలిచిన సమస్యల కాలంలో కోటి 60 లక్షల రూపాయలు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే సీఎంఆర్ఎఫ్ 6 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు దాన్యం కొనుగోలు వేగంగా జరుగుతుందన్నారు సన్ అవార్డులకు 500 రూపాయలు బోనస్ రైతుల ఖాతాలో జమ చేసినట్లు వెల్లడించారు.