మెదక్: పొటాష్ తో కలిపి యూరియా చల్లాలి : మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్
Medak, Medak | Sep 18, 2025 పొటాష్ తో కలిపి యూరియా చల్లాలి : మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు. రెండు రోజుల్లో సరిపడా యూరియా మండలం లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. గురువారం మధ్యాహ్నం పీఏసీఎస్ కేంద్రంలో ఎరువుల నిల్వలను అయన తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పొట్ట దశకు చేరిన వరి పంటకు ఎకరాకు అర బస్తా పొటాష్, అర బస్తా యూరియా వాడాలని రైతులకు సూచించారు. అధిక మొత్తదులో ఎరువులు వాడొద్దని ఈ సందర్బంగా అయన సూచించారు.