సూళ్లూరుపేటలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని వ్యక్తి మృతి
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట టౌన్ రైల్వే ఎల్ సీ గేట్ 60 సమీపంలోని సత్యసాయి మందిరం దగ్గర రైలు పట్టాలు దాటుతున్న ఓ వృద్దుడిని శుక్రవారం కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జి.ఆర్.పి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. గుర్తించిన వారు సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని వారు తెలియజేశారు.