సంతనూతలపాడు: ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించిన సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలను ఎమ్మెల్యే విజయ్ కుమార్ స్వీకరించారు. స్వీకరించిన అర్జీలు అన్నిటిని సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరిస్తామని విజయకుమార్ తెలిపారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికై ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే విజయకుమార్ ప్రజలకు తెలిపారు.