వైసిపి నేత రామరాజు ఇంటిని ముట్టడించిన వడ్డిగూడెం గ్రామస్తులు భారీగా మోహరించిన పోలీసులు
Eluru Urban, Eluru | Sep 21, 2025
వైసిపి పార్టీకి చెందిన మోరు రామరాజు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకుని తమను మోసం చేశాడని ఆరోపిస్తూ పెదపాడు మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన గ్రామస్తులు ఏలూరు లోని మోరు రామరాజు ఇంటి వద్ద "వంటా వార్పు" కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల క్రితం మోరు రామరాజు అనే వ్యక్తి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ గ్రామంలోని 500 మంది గ్రామస్తుల వద్ద నుండి 60 లక్షల రూపాయలు వసూలు చేశాడని, గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాలు ఇవ్వమని లేదా తమ డబ్బులు అయినా ఇవ్వాలని అడిగినప్పుడు వైసీపీ నాయకులతో బెదిరించేవాడని వాపోయారు.