సోమవారప్పాడులో సామూహిక ఎలుకలు నివారణ కార్యక్రమం, ఉచితంగా ఎలుకలు మందు పంపిణీ చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని
Eluru Urban, Eluru | Sep 17, 2025
రైతులందరూ సామూహికంగా ఎలుకల నిర్మూలనకు చర్యలు చేపట్టినప్పుడే ప్రయోజనం ఉంటుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. బుధవారం సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా దెందులూరు మండలం సోమవారపాడు లో రైతులకు ఎలకల నివారణ మందును ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా ఎలుకల వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు అన్నారు. వ్యవసాయ శాఖ ఏలూరు డివిజన్ సహాయ సంచాలకురాలు అనిల్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎలుకల కారణంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార పదార్థాలు ఏట పాడవుతున్నాయన్నారు.