పెద్దపల్లి: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో జాతీయ జెండా ఎగరవేసిన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్
బుధవారం రోజున జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఉబేదుల్లా కొత్వాల్ సాహెబ్ జాతీయ జెండాను ఎగరవేశారు పేదల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రంలో పరి ప్రజా పాలన కొనసాగుతుందని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఉబేదుల్లా కొత్వాల్ సాహెబ్ పేర్కొన్నారు. ప్రజా పాలన ఏర్పడినాటికి రాష్ట్ర ఆర్థిక స్థితి బాగా లేకపోయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని సంక్షేమ పథకాలపై వివరించారు