సంగారెడ్డి: విద్యార్థిని తిరిగి గురుకులంలో చేర్పించిన రిటైర్డ్ ఎంఈఓ అంజయ్య
కొండాపూర్ మండలం గిర్మాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రణయ్ కుమార్ను తండ్రి ప్రవీణ్ కుమార్ కూలి పనికి తీసుకెళ్లడంతో చదువుకు దూరమయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లి రమాదేవి కుమారుడిని తిరిగి గురుకులంలో చేర్పించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం రిటైర్డ్ ఎంఈఓ అంజయ్య దృష్టికి రావడంతో ఆయన వెంటనే పాఠశాలకు వెళ్లి అధికారులతో మాట్లాడి ప్రణయు గురుకులంలో చేర్పించి, విద్యకు భరోసా కల్పించారు